Laya DJ Tillu Dance | డీజే టిల్లు పాటకు లయ అదిరిపోయే డ్యాన్స్..వీడియో హల్చల్
డీజే టిల్లు టైటిల్ ట్రాక్ (DJ Tillu Title song) ఇపుడెక్కడ చూసినా మార్మోగిపోతుంది. పక్కా తెలంగాణ ఊర మాస్ బీట్తో సాగే ఈ పాటను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మూవీ డీజే టిల్లు (DJ Tillu). టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలోని డీజే టిల్లు టైటిల్ ట్రాక్ (DJ Tillu Title song) ఇపుడెక్కడ చూసినా మార్మోగిపోతుంది. పక్కా తెలంగాణ ఊర మాస్ బీట్తో సాగే ఈ పాటను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇపుడిదే పాటకు ఓ సెలబ్రిటీ డ్యాన్స్ చేసి అదరహో అనిపిస్తోంది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అలనాటి అందాల బ్యూటీ లయ (Laya Gorty) డీజే టిల్లు టైటిల్ సాంగ్‌కు ఇరగదీసే స్టెప్పులేసి ఔరా అనిపిస్తోంది. స్కూల్ మేట్స్ కలిసినపుడు..ఫన్నీ డ్యాన్స్ టైం అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జీన్స్ లో స్టైలిష్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో లాస్ ఏంజెల్స్ వీధుల్లో (Los Angeles) బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కొరియోగ్రఫర్ కూడా ఈ రేంజ్లో డ్యాన్స్ చేయలేడేమో అన్నట్టుగా తన స్నేహితురాలితో కలిసి స్టెప్పులేసింది. ఇపుడీ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.
2010లో బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం సినిమాలో చివరిసారిగా ఆదిపరాశక్తి పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది లయ. ఆ తర్వాత ఎనిమిదేళ్ల విరామం తర్వాత రవితేజ, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో తల్లి పాత్రలో నటించింది. అప్పటి నుంచి ఏ సినిమాలో కనిపించలేదు.
2006లో డాక్టర్ గణేశ్ గోర్టీని పెళ్లి చేసుకున్న లయకు ఒక కుమారుడు, కూతురున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిందీ ఈ సీనియర్ టాలీవుడ్ హీరోయిన్. రీసెంట్గా కళావతి సాంగ్‌కు కూడా డ్యాన్స్ చేసి మహేశ్ బాబునే మరిపించేలా చేసింది లయ.
Read Also : Jr NTR Deeksha | మాలధారణలో ఎన్టీఆర్..నెట్టింట్లో ఫొటోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
Read Also : Armaan Malik | నన్ను నమ్మండి..మహేశ్ బాబు ఫ్యాన్స్ కు సింగర్ అర్మాన్ మాలిక్ ట్వీట్
Read Also : R Madhavan Son | పుత్రోత్సాహంలో స్టార్ హీరో మాధవన్..మెడల్ అందుకుంటున్న వీడియో షేర్
Read Also : Ram Boyapati Movie | రామ్-బోయపాటి సినిమాపై నో అప్డేట్..కారణమదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

