పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో ఇస్మార్ట్ హిట్టు కొట్టాడు టాలీవుడ్ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni). 2019లో కిశోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన రెడ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియాబ్యాక్ డ్రాప్లో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు.
రామ్-బోయపాటి సినిమా ఆలస్యం అవుతుందని టాక్ నడుస్తోంది. కాగా ఆలస్యానికి కారణమేంటనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. హీరోయిన్ కారణంగానే ఈ మూవీ షూటింగ్ లో జాప్యం అవుతుందట. మేకర్స్ ఇప్పటికే కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandana)ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. కానీ కథానుగుణంగా సెకండ్ హీరోయిన్ కూడా అవసరమవడంతో..ఎవరిని ఎంపిక చేయాలనే వేటలో లేట్ అవుతుందట.
తాజా అప్ డేట్ ప్రకారం బోయపాటి టీం రెండో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం బాలీవుడ్ భామ అయితే బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ లీడ్ పై ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడంతోనే రామ్ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ రావడం లేదని ఇపుడు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు సినీ జనాలు.
మరోవైపు రష్మిక కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటుందో చెప్పడం కష్టమే. రెండో హీరోయిన్ ఫైనల్ అయ్యాకే ఈ ప్రాజెక్టుపై కొత్త న్యూస్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.