విఘ్నేశ్ శివన్ ( Vignesh Shivan) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్(Kaathu Vaakula Rendu Kadhal). కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), టాలీవుడ్ భామ సమంత (Samantha) కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ పాట ప్రోమోను విడుదల చేశారు.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన టూ..టూ..టూ అంటూ సాగే సాంగ్ మూవీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో చెప్పారు మేకర్స్. విజయ్ సేతుపతి ఓ వైపు సమంత, మరోవైపు నయనతార..ఇలా ఇద్దరు భామలతో కలర్ ఫుల్ సాంగ్ మాస్ స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
ఓ వైపు విలన్గా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు హీరోగా ఫ్యాన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు మక్కల్ సెల్వన్.