టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) -స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR 30)ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించబోతుందని ఇప్పటికే అప్ డేట్ బయటకు వచ్చింది. కాగా ఇపుడు అలియాభట్ మూవీ లవర్స్ కు షాకిచ్చే నిర్ణయం తీసుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు అలియాభట్ ప్రకటించిందని బీటౌన్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు కూడా చెప్పేసిందట. బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్ (Ranbhir kapoor)తో పెళ్లి పీటలెక్కిన నేపథ్యంలో సినిమాల డేట్స్ మార్చుకునే టైం వచ్చింది. అయితే కొంతకాలం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకే అలియా ఇలాంటి నిర్ణయం తీసుకుందా..? అనే టాక్ వినిపిస్తున్నా..దీనిపై క్లారిటీ లేదు.
మరోవైపు ఇటీవలే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్లో పోషించిన సీత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో..ప్రాంతీయ భాషా చిత్రాల్లో హీరోయిన్లకు అంత స్కోప్ ఉండదని అలియాభట్ భావిస్తుందని టాక్.అంతేకాదు కొరటాల శివ తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లను కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితం చేయడం లాంటి అంశాలు కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టు నుంచి అలియాభట్ తప్పుకోవడానికి ఓ కారణమని అంటున్నారు సినీ విశ్లేషకులు.
గతంలో ఈ సినిమా కోసం జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా..ఆ భామ కూడా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందని టాక్ వచ్చింది. ఇపుడు అలియాభట్ కూడా తప్పుకోవడంతో ఎన్టీఆర్ సినిమాకు ఇద్దరి బాలీవుడ్ భామలు నో చెప్పినట్టైంది.