ప్రయోగాత్మక సినిమాలు, కథాబలమున్న సినిమాలు చేసే స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ హీరో నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి సీతారామమ్ (Sita Ramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇంతకీ విషయమేంటంటే
ప్రపంచంలోనే ఎత్తెన పోస్ట్ ఆఫీస్ ఉన్న ప్రాంతం స్పిటి వ్యాలీ (Spiti Valley). హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం (Hikkim ) గ్రామంలో ఈ పోస్టాఫీస్ ఉంది. అంటే సముద్ర మట్టానికి 4440 మీటర్ల ఎత్తు (14567 అడుగులు) అన్నమాట. ఇటీవలే మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ గ్రామంలో -25 డిగ్రీల ఉష్ణోగ్రతలో సీన్లను షూట్ చేశారు. స్పిటి వ్యాలీలో షూటింగ్ అద్బుతమైన ఎక్స్పీరియన్స్ అని, షూటింగ్ సమయంలో స్థానిక గ్రామస్థులు చాలా సాయం చేశారని హనురాఘవపూడి టీం చెప్పుకొచ్చింది.
వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీతో వస్తోంది సీతారామమ్. ఈ చిత్రంలో రామ్ అనే జవాన్ పాత్రలో నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కన్నడ భామ రష్మిక మందన్నా కీలక పాత్రలో కనిపించనుంది.