KGF 2 Editor | ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ ఎడిటర్ వయసెంతో తెలిస్తే షాకే..!
మోస్ట్ అవెయిటెడ్ పాన్ఇండియా ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉంది.
మూవీ లవర్స్ మెల్లమెల్లగా ఆర్ఆర్ఆర్ మేనియా నుంచి బయటకు వస్తూ..ఇపుడు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) జపం చేస్తున్నారు. ఈ మోస్ట్ అవెయిటెడ్ పాన్ఇండియా ప్రాజెక్టు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
యశ్ (Yash) లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా కేజీఎఫ్ చాఫ్టర్ 2. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తున్న ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు స్టార్ ఎడిటర్ పనిచేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారేమో. అలాంటిదేమి లేదు. ఈ సినిమాకు పనిచేసింది 19 ఏళ్ల యువకుడు. అవును మీరు చదివింది నిజమే. గతంలో షార్ట్ ఫిలిమ్స్, పలు పాపులర్ సినిమాలకు ఫ్యాన్ ఎడిట్స్ చేసిన ఉజ్వల్ కులకర్ణి (Ujwal Kulkarni)ని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఎడిటర్‌గా తీసుకున్నాడు.
ఉజ్వల్ పనితనం చూసి ఇంప్రెస్ అయిన ఈ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఎడిటింగ్ బాధ్యతలను అతనికి అప్పగించాడట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే ఉజ్వల్ ఎడిటింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇక ఇపుడు పూర్తి సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఉజ్వల్. ఇంత తక్కువ వయస్సులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్‌గా పనిచేయడం నిజంగా ఉజ్వల్‌కు పెద్ద అఛీవ్ మెంట్ అని అంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

