Jr NTR Deeksha | మాలధారణలో ఎన్టీఆర్..నెట్టింట్లో ఫొటోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా తమ ఇష్టదైవాల కోసం మాలలు వేసుకుని, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ (Jr NTR) ఆంజనేయ స్వామి దీక్ష (Anjaneya Swamy Deeksha) వేసుకున్నారు.
హిందువుల్లో ఎక్కువ మంది వేసే మాలాధారణల్లో అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష చాలా ప్రాచుర్యం పొందినవి. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా తమ ఇష్టదైవాల కోసం మాలలు వేసుకుని, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమా విడుదల తర్వాత తారక్ మాలాధారణ వేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అప్డేట్ నిజమైంది. ఎన్టీఆర్ (Jr NTR) ఆంజనేయ స్వామి దీక్ష (Anjaneya Swamy Deeksha) వేసుకున్నారు.
నియమ నిష్టల ప్రకారం మాలలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు లేకుండా ఉండటమే కాకుండా శాఖాహారాన్ని తీసుకుంటున్నాడు తారక్. ఇటీవలే హనుమాన్ దీక్షా మాలలో భాగంగా జరిగిన ప్రత్యేక పూజలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు ఎన్టీఆర్. ఈ స్టిల్స్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియా పేజీల్లో తెగ వైరల్ చేస్తున్నారు. 21 రోజులపాటు దీక్ష తీసుకున్నాడని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
దీక్ష పూర్తయిన తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ లో చేరనున్నట్టు టాక్. ఈ చిత్రం కోసం తారక్ న్యూ లుక్‌లో స్ట్రాంగ్‌గా కనిపించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నాడట. దీంతోపాటు సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాలు కూడా తారక్ లిస్టులో ఉన్నాయి. ఇప్పటికే మరో ట్రిపుల్ హీరో రాంచరణ్ (Ram Charan) అయ్యప్ప స్వామి దీక్ష (Ayyappa Swamy Deeksha) తీసుకున్న తీసుకున్న విషయం తెలిసిందే.
Read Also : Armaan Malik | నన్ను నమ్మండి..మహేశ్ బాబు ఫ్యాన్స్ కు సింగర్ అర్మాన్ మాలిక్ ట్వీట్
Read Also : Ram Boyapati Movie | రామ్-బోయపాటి సినిమాపై నో అప్డేట్..కారణమదేనా..?
Read Also : Jr NTR Deeksha | మాలధారణలో ఎన్టీఆర్..నెట్టింట్లో ఫొటోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
Read Also : R Madhavan Son | పుత్రోత్సాహంలో స్టార్ హీరో మాధవన్..మెడల్ అందుకుంటున్న వీడియో షేర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

