రన్ వీర్ సింగ్ (Ranveer Singh) అంటే యాక్షన్, మాస్ అండ్ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ క్రేజీ యాక్టర్ కంప్లీట్ హోమ్లీ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్ (Jayesh Bhai Jordaar). అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే (Shalini Pandey) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ నా తండ్రి..మా ఊరికి సర్పంచ్..ఆయన తర్వాత నేను..మరి నా తర్వాత ఎవరనే టెన్షన్..అంటూ రన్ వీర్ సింగ్ వాయిస్ ఓవర్‌తో సాగే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్.
జయేశ్ భాయ్ (రన్ వీర్‌సింగ్) తండ్రి బొమన్ ఇరానీ (Boman Irani) ఓ గ్రామానికి సర్పంచ్. ఆయన కొడుకుగా రన్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. అయితే పొలిటీషియన్ కావడంతో తండ్రి తర్వాత రన్ వీర్ సింగ్ సర్పంచ్ అవుతాడు. ఆ తర్వాత అతడి జీవితంలోకి షాలిని పాండే భార్యగా వస్తుంది. తండ్రికేమో తన వారసత్వాన్ని కొనసాగించేందుకు మనవడు కావాలని ఉంటుంది. కానీ జయేశ్ భాయ్‌కు మాత్రం మొదట కూతురు పడుతుంది.
తనకు మనవడు కావాలని కోరుకుంటున్న తండ్రి బొమన్ ఇరానీ కోరికతో జయేశ్ భాయ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కథాంశంతో సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగనున్నట్టు ట్రైలర్ తో అర్థమవుతుంది. ఇక గ్లామరస్ రోల్లో కనిపించిన షాలినీ పాండే..ఈ సారి మాత్రం పక్కా హోమ్లీ రోల్లో సరికొత్తగా కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రనిర్మాత సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నారు.