టాలీవుడ్ (Tollywood) హీరో మహేశ్ బాబు (Mahesh Babu) పరశురాం డైరెక్షన్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata). ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న అప్ డేట్ ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాలో వచ్చే చివరి పాటను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌తో షూటింగ్ పూర్తయినట్టేనని సమాచారం. కాగా ఇపుడు మరో క్రేజీ వార్త నెట్టింట హల్‌చేస్తోంది. మహేశ్ స్టెప్పులేయబోయే తాజా పాట సీనియర్ హీరో బాలకృష్ణ నుంచి స్పూర్తిగా తీసుకుని సాగుతుందట. ఇంతకీ ఆ పాట ఏంటనే కదా మీ డౌటు.
ఇటీవలే వచ్చిన అఖండ చిత్రంలోని జై బాలయ్య పాట. ఈ చిత్రంలో యా యా యా బాలయ్య అంటూ సాగే పాట ఏ రేంజ్లో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సర్కారు వారి పాటలో మహేశ్ పేరును హైలెట్ చేసేలా మా మా మా మహేశు అంటూ పాట ఉండబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని హీరోలు తమ పేర్లను పాటల్లో వాడుకోగా..మహేశ్ మాత్రం తొలిసారి ఈ స్టంట్ చేయబోతుండటం ఆసక్తిగా మారింది.
మాస్ ఎంటటర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదల కళావతి సాంగ్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక తాజాగా వచ్చిన సాంగ్ అప్డేట్ ఎంతవరకు నిజమనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాటలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.