Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?
కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ చిత్రంలో శ్రీవల్లిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించి..ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ కూడా త్వరలోనే షురూ కానున్నట్టు వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి.
పుష్ప..సుకుమార్, అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేసింది. తెలుగు, మలయాళం, హిందీతోపాటు మిగిలిన భాషల్లో మంచి టాక్తో కలెక్షన్లను రాబట్టింది. కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ చిత్రంలో శ్రీవల్లిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించి..ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ కూడా త్వరలోనే షురూ కానున్నట్టు వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి.
తాజాగా మరో అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) యూఎస్ నుంచి నెల రోజుల తర్వాత హైదరాబాద్కు తిరిగా రానున్నాడట. పుష్ప 2 మొదలుపెట్టేందుకు మరో 3-4 నెలలు టైం తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇది అఫీషియల్ అప్డేట్ కాకున్నా.. ఇంతకీ ఇలా సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడని సినీజనాలు అప్పుడే తెగ చర్చించడం మొదలుపెట్టారు. దీనిపై ఓ గాసిప్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా చూసిన తర్వాత సుకుమార్ తన మైండ్ సెట్ మార్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది. పుష్పకు సీక్వెల్గా రాబోతున్న పుష్ప 2 ది రూల్..భారీ స్థాయిలో రిచ్గా చూపించాలని ఫిక్స్ అయ్యాడట ఈ స్టార్ డైరెక్టర్. అందువల్ల నటీనటుల డేట్స్ సర్దుబాటు విషయాన్ని పక్కన పెట్టేసినట్టు వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ అప్ డేట్పై బన్నీ అభిమానుల సంగతెలా ఉన్నా..ఇది మాత్రం రష్మికకు చాలా కలిసొచ్చే అంశం. ఎందుకంటే పుష్ప 2 ఆలస్యమైతే టైం దొరుకుతుంది కదా.
ఇపుడలాంటి ఛాన్స్ వస్తుండటంతో హ్యాపీగా ఫీలవుతుందని జోరుగా టాక్ నడుస్తోంది. రష్మిక ఇప్పటికే విజయ్ 66వ సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్ యానిమల్ (Animal) చిత్రం కూడా చేస్తోంది. రష్మికకు ప్రస్తుతం ఈ రెండు పెద్ద ప్రాజెక్టుల పూర్తి చేయడం చాలా ముఖ్యం. పెద్ద ప్రాజెక్టు అయిన పుష్ప 2 కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇపుడు ఈ సినిమా ఆలస్యమవుతుండటంతో తన ఫోకస్ మిగిలిన రెండు ప్రాజెక్టులపై పెట్టేందుకు సమయం దొరికినట్టవుతుంది. మరి రష్మిక సంతోషంగా ఉండక ఇంకెలా ఉంటుందంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు.
Read Also : Samantha | లాంఛింగ్ ఈవెంట్లో కనిపించని సామ్..ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Also : Neha Shetty | ‘అమ్మాయే సన్నగా..’ డీజే టిల్లు భామకు ఫిదా అవ్వాల్సిందే
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

