టాలీవుడ్ ( Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh ), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వస్తున్న చిత్రం ఎఫ్3 (F3). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కీ రోల్ పోషిస్తుండగా..పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఐటెంసాంగ్ లో మెరవనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా డైరెక్టర్ అనిల్‌రావిపూడి మరో క్రేజీ లిరికల్ వీడియో సాంగ్‌ను మూవీ లవర్స్ తో షేర్ చేసుకున్నాడు.
ఊ ఆ హ..హ అంటూ మాస్ బీట్ తో సాగుతుందీ పాట. వెంకీ, తమన్నా, వరుణ్, మెహరీన్ పెయిర్ ఈ పాటతో ఫుల్ టైమ్ ఎంటర్టైన్ మెంట్‌ను అందించడం పక్కా అని తెలుస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సునిధి చౌహాన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ పాడారు. ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్3లో శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, ప్రగతి, రాజేంద్రప్రసాద్, అంజలి, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి మ్యూజిక్ డైరెక్టర్. ఎఫ్2 కు కొనసాగింపుగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ఫ్యాన్స్.. ట్రిపుల్ బొనాంజా అందించడం గ్యారంటీ అంటున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.