తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కమెడియన్లకు ఏ మాత్రం తక్కువ కానీ స్థాయిలో వాళ్లు కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లను చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుంది. బుల్లితెరను మకుటం లేని మహారాజులా ఏలేస్తున్నాడు సుధీర్. ఆయన టీంలో చేసే గెటప్ శ్రీను గురించి పరిచయాలు అవసరం లేదు. కొన్నేళ్ళుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు శ్రీను. అటు సినిమాలు చేస్తున్నా కూడా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. సుడిగాలి సుధీర్ టీంలో కీ మెంబర్ గా ఉన్నాడు ఈ కమెడియన్. అయితే కొన్ని వారాలుగా ఈయన సుధీర్ టీంలో కనిపించడం లేదు. కేవలం రాంప్రసాద్, సన్నీతోనే స్కిట్స్ చేస్తున్నాడు సుధీర్.
దాంతో గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పైగా సుధీర్ టీం కూడా దీనిపై సెలెంట్ గానే ఉన్నారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అన్నింటికి మించి కొన్ని నెలల నుంచి జబర్దస్త్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ముందు దర్శక ద్వయం నితిన్ భరత్ వెళ్లిపోయారు. వాళ్లతో పాటు నాగబాబు కూడా జీ తెలుగుకు వెళ్లిపోయాడు. ఇక చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా అక్కడికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ముక్కు అవినాష్ బిగ్ బాస్ కోసం జబర్దస్త్ షోను వదిలేసాడు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను కూడా షోకు దూరం అయ్యాడని అంతా అనుకున్నారు. అయితే ఈ సమయంలో తాను ఎక్కడికి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చాడు శ్రీను.సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను అదే సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చాడు. అందరికీ నమస్కారం.. మూవీ షూట్ అయిన తరువాత మా టీంలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. నేను టెస్ట్ చేసుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజులు బయటకు రాకూడదని, హోం ఐసోలేషన్‌లో ఉన్నాను.
ఆ టైంలో జబర్దస్త్ షూటింగ్‌కి వెళ్లడం కుదరలేదు.. మరల 18వ తేదీన శుక్రవారం మన షోలో కలుద్దాం. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ మీ గెటప్ శ్రీను అంటూ క్లారిటీ ఇచ్చాడు ఈయన. ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గెటప్ శ్రీను. ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేసాడు ఈయన. కోర మీసాలతో హీరోగా మారిపోయాడు.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!