రొమాంటిక్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). ఈ టాలెంటెడ్ దర్శకుడు తెలుగు, తమిళ ప్రేక్షకులకు సూపర్ హిట్ సినిమాలను అందించాడు. గౌతమ్ మీనన్ కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో తెరకెక్కించిన ది లైఫ్ ఆఫ్ ముత్తు విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
కాగా గౌతమ్ మీనన్ టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పాడు గౌతమ్ మీనన్. గౌతమ్ మీనన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్(Jr NTR)ను డైరెక్ట్ చేయడమంటే ఇష్టమని చెప్పిన గౌతమ్ మీనన్…ఈ యాక్టర్లతో తరచూ టచ్‌లో ఉన్నానన్నాడు.
ఈ దర్శకుడు త్వరలోనే ది లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్-2ను ప్రారంభించనున్నాడు. మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా కథాంశాలతో వస్తున్న సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టు కే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభాస్-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో సినిమా రావాలంటే కొంత సమయం ఆగాల్సిందే.
అన్నీ కుదిరితే రాబోయే కాలంలో వీరిద్దరి కాంబోలో సినిమా రావడం మాత్రం ఖాయమని తాజా అప్డేట్ చెబుతోంది. గౌతమ్ మీనన్ మరోవైపు రాబోయే కాలంలో తారక్‌తో కూడా సినిమా చేసే అవకాశాలున్నాయని హింట్ ఇచ్చేశాడు.