KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
నార్త్ ఇండస్ట్రీలో కేవలం కరణ్ జోహార్ కారణంగానే నెపోటిజం పెరిగిపోతుంది అనేది చాలామంది వాదన. టాలెంట్ లేకపోతే ఆయన మాత్రం ఎక్కడినుంచి వారసులను పరిచయం చేస్తాడు..తన డబ్బులు తాను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు అరగడానికి మీరెవరు.. అంటూ కరణ్ జోహార్ ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు.
కరణ్ జోహార్ (KARAN JOHAR)అనే మాట వినిపిస్తే చాలు బాలీవుడ్ (BOLLYWOOD) లో ఇప్పుడు చాలామంది భగ్గుమంటున్నారు. నార్త్ ఇండస్ట్రీలో కేవలం ఈయన కారణంగానే నెపోటిజం పెరిగిపోతుంది అనేది చాలామంది వాదన. టాలెంట్ లేకపోతే ఆయన మాత్రం ఎక్కడినుంచి వారసులను పరిచయం చేస్తాడు..తన డబ్బులు తాను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు అడగడానికి మీరెవరు.. అంటూ కరణ్ జోహార్ ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పటికే బాలీవుడ్ లో ఎంతో మంది వారసులను పరిచయం చేసిన ఈయన.. ఇప్పుడు తన దృష్టిని టాలీవుడ్ వైపు మళ్ళించాడని తెలుస్తోంది.
ఈ మధ్య విజయ్ దేవరకొండ (VIJAYDEVERAKONDA) హీరోగా లైగర్ సినిమాను హిందీలో నిర్మించాడు కరణ్ జోహార్. అయితే ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇందులో ఆయన డబ్బులు ఏవి పెట్టలేదని కేవలం పేరు మాత్రమే ఇచ్చాడని.. ఆ బ్రాండ్ తో దేశమంతా సినిమాను విడుదల చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన అఖిల్ అక్కినేని (AKHIL AKKKINENI)బాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా రోజులుగా కరణ్ జోహార్, అఖిల్ సినిమాపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే దీనిని ఎవరు ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఆ మధ్య బాగా వినిపించిన ఈ న్యూస్ ఉన్నట్టుండి కనుమరుగయిపోయింది. దాంతో ఈ కాంబినేషన్ గురించి ఇన్ని రోజులు ఎవరూ మాట్లాడలేదు. అయితే ఉన్నట్టుండి గత రెండు రోజులుగా కరణ్ జోహార్, అఖిల్ అక్కినేని సినిమా గురించి సోషల్ మీడియాలో బాగా న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏజెంట్ తర్వాత అఖిల్ బాలీవుడ్ వెళ్తున్నాడని.. అక్కడ తన ధర్మ ప్రొడక్షన్స్ లో అక్కినేని వారసుడిని హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడనేది దీని సారాంశం.
నాగార్జున సైతం తన వారసుడిని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నాడు. అయితే సరైన కథ దొరకడం లేదు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఇది గాని హిట్ అయిందంటే అఖిల్ కోరుకుంటున్న ఇమేజ్.. దాంతో పాటు మార్కెట్ వస్తుంది. అప్పుడు కరణ్ జోహార్, అఖిల్ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Also : Raju Srivastava | ఆటో డ్రైవర్ నుంచి.. స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాజు శ్రీవాస్తవ
Read Also : Gauri Khan | ఒకేసారి ఇద్దరితో డేటింగ్ వద్దు.. కూతురికి షారుఖ్ భార్య సలహా
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

