Raju Srivastava | ఆటో డ్రైవర్ నుంచి.. స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాజు శ్రీవాస్తవ
Raju Srivastava | ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీనివాస్తవ బుధవారం కన్నుమూశారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స అందిస్తూ రాగా.. పరిస్థితి విషమించడంతో
Raju Srivastava | ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీనివాస్తవ బుధవారం కన్నుమూశారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స అందిస్తూ రాగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాజు
శ్రీవాస్తవ కన్పూర్లో జన్మించారు. తన హాస్యంతో రాజు శ్రీవాస్తవ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు. హాస్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రాజు శ్రీవాస్తవను గజోధర్ భయ్యాగా పిలుచుకుంటారు. ఈ పేరుతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు. కాన్పూర్‌లో 25 డిసెంబర్ 1963న జన్మించిన రాజు శ్రీవాస్తవ తండ్రి రమేశ్ చంద్ర శ్రీవాస్తవ. ఆయన ప్రముఖ కవి.
ముంబైలో ఆటో రిక్షా నడిపి..
1982లో రాజు శ్రీవాస్తవ ముంబైకి వెళ్లాడు. జీవన పోరాటం ఇక్కడే ప్రారంభమైంది. సినిమారంగంలోకి ప్రవేశానికి ముందు తొలి రోజుల్లో జీవనోపాధి కోసం ఆటోరిక్షాను సైతం నడిపాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అనిల్ కపూర్ తేజాబ్ ద్వారా శ్రీవాస్తవ బాలీవుడ్‌లోకి అడుగుపెటారు. తనదైన కామెడీతో సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’ చిత్రంలో ట్రక్ క్లీనర్ పాత్రను పోషించాడు. అలాగే షారుఖ్ ఖాన్‌తో కలిసి బాజీగర్ చిత్రంలో కాలేజీ విద్యార్థి పాత్రలో నటించాడు. ఆమ్దాని అత్తన్ని ఖర్చ రూపయ్యలో బాబా చిన్ చిన్ చు, వా తేరా క్యా కెహనాలో బన్నే ఖాన్ అసిస్టెంట్ పాత్ర, మెయిన్ ప్రేమ్ కీ దీవానీ హూన్లో శంభు పాత్ర పోషించాడు.
అమితాబ్ అంటే ఇష్టం..
రాజు శ్రీవాస్తవకి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. బిగ్ బి షోలే చిత్రం బాగా నచ్చిన చిత్రం. ఆ చిత్రం రాజు శ్రీవాస్తవను తీవ్రంగా ప్రబావితం చేసింది. ఆ చిత్రం చూసిన తర్వాత అచ్చం అమితాబ్ బచ్చన్‌లాగే మాట్లాడడం, శైలిని అనుకరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ వాయిస్‌ను మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. అమితాబ్ వాయిస్‌ను అనుకరించినందుకు తొలిసారిగా రూ.50
పారితోషికంగా అందుకున్నాడు.
ఫేమ్‌ను తెచ్చిన షో ఇదే..
అయితే, రాజు శ్రీవాస్తవ చాలా చిత్రాల్లోనే నటించినా మంచి ఫేమ్ రాలేదు. 2005లో స్టార్ వన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో’లో రాజు శ్రీవాస్తవ పాల్గొన్నగా.. ఆ షోజు రాజు శ్రీవాస్తవ జీవితాన్నే మార్చి వేసింది. ఈ షో ద్వారా చాలా పాపులారిటీ సంపాదించాడు. రాజు శ్రీవాస్తవ కామెడీ కింగ్‌గా మారి గజోధర్ భయ్యాగా పేరు తెచ్చిపెట్టిన షో ఇదే. అయితే, ఈ షోలో రాజు శ్రీవాస్తవ రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఛాలెంజ్ తర్వాత, రాజు శ్రీవాస్తవ రియాలిటీ షో బిగ్ బాస్-3లోనూ పాల్గొన్నాడు. ఆ తర్వాత, కామెడీ షో మహా ముఖబలా, నాచ్ బలియే వంటి షోల్లోనూ కనిపించాడు. రాజు శ్రీవాస్తవ తన భార్యతో మొదటిసారిగా నచ్ బలియేలో కనిపించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

