Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
బిగ్ బాస్ హౌస్ (Bigboss 6 Telugu) మొత్తానికి కాంట్రవర్సీ క్వీన్ లా తయారైపోయింది గీతూ రాయల్ (Geetu Royal).గేమ్ ఆడుతున్న తీరు విషయంలో ఈమెపై ఎవరు కంప్లైంట్స్ చేయకపోయినా కూడా..ఇంట్లో ఉంటున్న తీరు.. ఆమె వ్యవహరిస్తున్న విధానంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి.
బిగ్‌బాస్ ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రెండు వారాల కింద కేవలం ఒక నార్మల్ కంటెస్టెంట్ గా వచ్చిన గీతూ రాయల్ (Geetu Royal)..ఈ రోజు బిగ్ బాస్ హౌస్ (Bigboss 6 Telugu) మొత్తానికి కాంట్రవర్సీ క్వీన్ లా తయారైపోయింది. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడం ఈమెకు అలవాటైపోయింది. గేమ్ ఆడుతున్న తీరు విషయంలో ఈమెపై ఎవరు కంప్లైంట్స్ చేయకపోయినా కూడా..ఇంట్లో ఉంటున్న తీరు.. ఆమె వ్యవహరిస్తున్న విధానంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా పెద్దవాళ్లకు కూడా గౌరవం ఇవ్వకుండా తనకు నచ్చినట్టు చేస్తున్న గీతూ రాయల్ పై సోషల్ మీడియాలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే గతవారం ఈమె గేమ్ ఆడిన తీరు అందరికీ నచ్చింది. ముఖ్యంగా నాగార్జున (Nagarjuna)కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతో ఈమెకు కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటూ దారుణమైన విమర్శలు వస్తున్నాయి. తాజాగా మొదలైన దొంగ పోలీసు టాస్క్ లో ఎవరూ ఆట ఆడకుండా..అన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్న గీతూ ఆట తీరును చూసి అందరూ విమర్శిస్తున్నారు.
ఇంట్లో సభ్యులు అయితే ఇలా ఉంటే.. మిగిలిన వాళ్ళ ఆట ఎలా సాగుతుంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ పవర్స్ గీతూకు ఇచ్చాడు. మామూలుగానే ఆటను తనకు నచ్చినట్టు ఆడే గీతూ.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్‌తో మరింత రెచ్చిపోయింది. మిగిలిన వాళ్ళ ఆటను పూర్తిగా ఆపేస్తూ గేమ్ మొత్తం తన వైపు తిప్పుకుంది. ఈమె ఇలా ఆడితే ఈ వారం కూడా గీతూ బెస్ట్ ప్లేయర్ కావడం ఖాయం.
కాకపోతే బిగ్ బాస్ ఈమెకి ఇచ్చిన అడ్వాంటేజ్ మిగిలిన కంటెస్టెంట్స్ కు కూడా ఇవ్వాలి కదా అనేది అందరూ అడుగుతున్న పాయింట్. ఇవన్నీ చూస్తుంటే కావాలనే గీతూను బిగ్‌బాస్ లో హైలెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మొత్తం ఆమె చుట్టూ నడిపితే రేటింగ్ వస్తుందని షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

