OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
మూవీ లవర్స్ కు వినోదం అందించేందుకు సినిమాలు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసేందుకు కొత్త చిత్రాలు రెడీ అంటున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై ఓ లుక్కేస్తే..
ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. మూవీ లవర్స్ కు వినోదం అందించేందుకు సినిమాలు ప్రతీ వారం రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసేందుకు కొత్త చిత్రాలు రెడీ అంటున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై ఓ లుక్కేస్తే..
దొంగలున్నారు జాగ్రత్త..

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jaagratha)సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ , ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని కీ రోల్ పోషించాడు. మరి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి.
అల్లూరి..
కాప్ డ్రామా నేపథ్యంలో శ్రీవిష్ణు (Sree Vishnu) నటిస్తున్న సినిమా అల్లూరి (Alluri). ‘ది గ్రేటెస్ట్ పోలీస్ స్టోరీ ’ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ వీడియోలతో అంచనాలు పెంచేస్తున్నాడు శ్రీవిష్ణు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది. నిజాయితీ గల పోలీసాఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఎలా మెప్పిస్తాడనేది చూడాలి.
కృష్ణ వృంద విహారి..

యువ హీరో నాగశౌర్య (Naga Shaurya), బాలీవుడ్ నటి షిర్లే సెటియా కాంబోలో వస్తున్న చిత్రం కృష్ణ వృంద విహారి. అనిష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ (Ira Creations)పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు.
బబ్లీ బౌన్సర్..

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). తొలి మహిళా బౌన్సర్ జీవిత కథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని మాధుర్ బండార్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫన్ డ్రామా నేపథ్యంలో హిందీతోపాటు తెలుగులో రిలీజవుతున్న ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందనవస్తోంది. సెప్టెంబర్ 23న డిస్నీ + హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది.
చుప్..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం చుప్ (Chup). ఆర్ బాల్కీ (R Balki) డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చుప్ ట్రైలర్ ..సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని పెంచుతుంది. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. శ్రేయాధన్వంతరీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..పూజాభట్ మరో కీలక పాత్ర పోషిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

