Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
ఇటీవలే మల్టీ స్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra)లో రణ్ బీర్ కపూర్‌తో కలిసి మెరిసింది అలియాభట్ (Alia Bhatt).బ్రహ్మాస్త్ర విడుదలైనప్పటికీ అలియాభట్ ప్రమోషన్స్‌కు టైం కేటాయించడం విశేషం.
బాలీవుడ్ (Bollywood)స్టార్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt)ఇటీవలే మల్టీ స్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra)లో మెరిసిన విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్రలో మెరిసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ పార్టు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చెబుతున్నాయి. అలియాభట్ బ్రహ్మాస్త్ర విడుదలైనప్పటికీ ప్రమోషన్స్‌కు టైం కేటాయించడం విశేషం.
బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ మరింత పెంచేస్తుంది అలియాభట్. ఇక బ్రహ్మాస్త్ర మూడు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా చెప్పిన విషయం ఇపుడు టాక్ ఆఫ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా సీక్వెల్ (Brahmastra 2)లో ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని అభిప్రాయడింది అలియా.
ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే కదా మీ డౌటు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే (Deepika Padukone). ఫస్ట్ పార్ట్‌లో అమృతగా గెస్ట్ రోల్లో మెరిసింది దీపికాపదుకొనే. సెకండ్ పార్ట్‌లో దీపికా కీలక పాత్రలో కనిపించాలని ఉందని తన మనసులో మాట చెప్పింది అలియా. ఫస్ట్ పార్టు సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అయాన్ ముఖర్జీ రెండో పార్టు కోసం ప్రిపరేషన్ ప్లాన్‌లో ఉన్నాడని సమాచారం.
తాజా టాక్ ప్రకారం రెండో పార్టులో చాలా మంది పాపులర్ యాక్టర్లు కనిపించబోతున్నారట. మొత్తానికి అలియా భట్ పరోక్షంగా దీపికాపదుకొనే రెండో పార్టులో ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుందని హింట్ ఇచ్చిందా..?..తనకు అనిపించింది చెప్పిందా..? అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Also : Gauri Khan | ఒకేసారి ఇద్దరితో డేటింగ్ వద్దు.. కూతురికి షారుఖ్ భార్య సలహా
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

