టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప (Pushpa). ఇప్పటికే విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా ఇటీవలే ఏ బిడ్డ.. ఇది నా అడ్డ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ లిరికల్వీడియో (Eyy Bidda Idhi Naa Adda Lyrical)ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆ పక్కా నాదే..ఈ పక్కా నాదే..తలపైనా ఆకాశం ముక్కా నాదే..ఆ తప్పూ నేనే ఈ ఒప్పూ నేనే..తప్పొప్పులు తగలెట్టే నిప్పూ నేనే..అంటూ ఊరమాస్‌గా సాగుతుంది పాట. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాయగా..నకాశ్ అజీజ్ పాడాడు. పుష్ప రాజ్‌గా నటిస్తున్న అల్లు అర్జున్ వైట్ ప్యాంట్, పూల చొక్కాలో ఓ చేతికి బ్రాస్లెట్, మరో చేతికి బంగారు వర్ణపు వాచ్ పెట్టుకుని ఈ పాటలో కొత్తగా కనిపిస్తున్నాడు.
ఏ బిడ్డ సాంగ్ క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడం పక్కా అని తాజా లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో కనిపించబోతున్నాడు సునీల్. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సునీల్ ఫస్ట్ పార్టులో, ఫహద్ ఫాసిల్ రెండో పార్టులో కనిపించనున్నారని టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక