నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 12 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలకు బదులుగా తీసుకువచ్చే నాలుగు లేబర్ కోడ్ లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని, అలాగే కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎన్ఆర్సీ రాజు, డిపో అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి, ఎస్‌డబ్ల్యూయూ రీజియన్ కార్యదర్శి యార చంద్రయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షుడు కందుల నర్సింహ, రీజియన్ సహాయ కార్యదర్శి కె.శ్యామ్ సుందర్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహయ్య, గులాం రసూల్ పాల్గొన్నారు.