4 వేల బ్యాంక్ బ్రాంచ్‌లకు తాళం
సామాన్యుడికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన బ్యాంకుల శాఖలు మూతపడుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను నియామకాలకు చెక్‌పెట్టడానికి పలు ప్రభుత్వరంగ సంస్థలు భారీ స్థాయిలో శాఖలను మూసివేస్తున్నాయి.
- గడిచిన ఐదేండ్లలో మూతపడిన ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖలు..
- రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిల్లీ, ఆగస్టు 11 : సామాన్యుడికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన బ్యాంకుల శాఖలు మూతపడుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను నియామకాలకు చెక్‌పెట్టడానికి పలు ప్రభుత్వరంగ సంస్థలు భారీ స్థాయిలో శాఖలను మూసివేస్తున్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా బ్రాంచ్ శాఖలు మూతపడ్డాయి. ఈ విషయాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2021-22లోనే 2,564 శాఖలు మూతపడగా, ఆ తర్వాత సంవత్సరంలో 700 శాఖలు మూతపడినట్టు చెప్పారు.
6 వేల శాఖలు ఒపెన్
వ్యాపార విస్తరణ కోసం గడిచిన ఐదేండ్లలో పీఎస్‌బీలు 6 వేలకు పైగా శాఖలను ఆరంభించాయి. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో 6,255 శాఖలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,967 శాఖలను ప్రారంభించిన బ్యాంక్‌లు, అంతకుముందు ఏడాదిలో 1,823 శాఖలను ఒపెన్ చేశాయి. విల్‌ఫుల్ డిఫాల్టర్లు తగ్గుముఖం పట్టారని మంత్రి చెప్పారు. రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారు 15,930 మంది ఉన్నారని, వీరి మొత్తం రుణం రూ.2.85 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు, జూన్ 30, 2025 నాటికి రూ.90,545 కోట్లుగా ఉన్న అన్‌క్లెయిమ్ డిపాజిట్లు జనవరి 31, 2026 నాటికి ఇవి రూ.98,073 కోట్లకు పెరిగాయి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

