
Evaru Meelo Koteeswarulu | జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ మూడేళ్లుగా స్క్రీన్‌పై కనిపించకపోవడంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టులోనే ఈ షో మొదలు కానుందని షో నిర్వాహకులు ఖరారు చేశారు. ఈ షో కోసం ఏర్పాట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే షో తేది దగ్గరకు వస్తుండటంతో వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదట విడుదలైన ఒక్క ప్రోమోను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రోమోను సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఈ షో కోసం తారక్ కూడా తనను తాను చాలా మార్చుకున్నాడు. గతంలో బిగ్ బాస్ సీజన్ వన్ ఈయన హోస్ట్ చేశాడు. ఆ నమ్మకంతోనే ఇంత పెద్ద షోను తారక్ చేతుల్లో పెడుతుంది జెమిని యాజమాన్యం. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి జూనియర్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు యంగ్ టైగర్. ఇది కేవలం ఒక గేమ్ షో మాదిరి కాకుండా.. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ప్రతి ఎపిసోడ్లో కచ్చితంగా ఒక ఎమోషనల్ స్టోరీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు షో నిర్వాహకులు. అక్కడికి వచ్చే కంటెస్టెంట్స్ నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొని.. వాటి నుంచి ఎమోషన్ పండించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేస్తున్న ప్రోమోల్లో కూడా ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్ కనిపిస్తుంది. కేవలం ఒక ఆటకు సంబంధించిన కార్యక్రమంలా దీన్ని ప్రమోట్ చేస్తే వర్కవుట్ కాదని.. మనసుకు సంబంధించిన ఆటగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా