MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల లొల్లి కొనసాగుతున్నది. ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తున్నారని నటి హేమ ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా నరేశ్నే మళ్లీ ఎన్నుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, ‘మా’ నిధులు రూ.5 కోట్లలో రూ.3 కోట్లు నరేశ్ ఖర్చు చేశారన్నారు. తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే ఆయన ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు జరపాలని అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న రెండు వందల మందికి లేఖ రాశానని, వారి నుంచి సంతకాలు సేకరిస్తున్నానని చెప్పారు. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈమేరకు ఆమె వాయిస్ మెసేజ్ వైరల్ అవుతున్నది.