రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ సినిమాల కన్నా కూడా అతను చేసే వెరైటీ పనులతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటాడు. అప్పట్లో ఒక సారి బీచ్‌లో నగ్నంగా పరుగెత్తి అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ షాకిచ్చాడు. తాజాగా నడిరోడ్డు మీద స్నానం చేసి అందుకు సంబంధించిన వీడియో షేర్ చేసి ఆశ్యర్యపరిచాడు.
షూటింగ్లో భాగంగా నడి రోడ్డు మీద స్నానం చేసిన మిలింద్.. ఓ వైపు వర్షం పడుతుండగా వేన్నీళ్లతో స్నానం చేశానని క్యాప్షన్ ఇచ్చాడు. పుషప్స్, రన్నింగ్స్తో పాటు ఇంకేదైనా చేయగలనా అని డౌట్ పడేవారికి ఈ వీడియోనే సమాధానమని పేర్కొన్నాడు. ఈ వీడియపై నెటిజన్స్ భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మీరు షూటింగ్ కోసం కాకపోయిన రియల్ లైఫ్‌లో కూడా చేస్తారు. గత వీడియోలు చూస్తే మీరేంటో మాకు అర్ధం కాదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మిలింద్ టర్కీబ్, 16 డిసెంబర్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాలతో పాటు పచ్చైకిలి, సత్యమేవ జయతే, అలెక్స్ పాండియన్ వంటి దక్షిణాది చిత్రాల్లోనూ నటించాడు.
ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకిత కొన్వర్ను వివాహం చేసుకుని గతంలో వార్తల్లో నిలిచాడు. 2018లో వీరి వివాహం జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bollywood
- milind soman
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

