God Father | ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చూస్తే చాలు అనుకున్నాడు ఆ కుర్రాడు. ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు హీరో అయ్యాడు. అలాంటిది ఇప్పుడు తన అభిమాన కథానాయకుడితోనే నటించే అవకాశాన్ని కొట్టేశాడు. అతడే సత్యదేవ్. ఈయన త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. గత 20 ఏళ్లలో కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు ఈయన. ఒకదాని వెంట మరొక సినిమాను వరసగా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో నాలుగు సినిమాలకు కూడా లైన్ క్లియర్ చేశాడు.
తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్‌తో పాటు లూసీఫర్ రీమేక్‌లో కూడా నటించబోతున్నాడు మెగాస్టార్. ఈ రెండు సినిమాలు కూడా 2022లోనే విడుదల కానున్నాయి. అందులో ముందు లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా కోసం డేట్స్ కూడా ఇచ్చాడు చిరంజీవి. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రీమేక్ స్పెషలిస్ట్ అయిన మోహన్ రాజాను తమిళం నుంచి తెచ్చుకున్నాడు చిరు. కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. లూసీఫర్ రీమేక్ కోసం గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో యువ హీరో సత్యదేవ్‌కు అదిరిపోయే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు 2020లో డిజిటల్ రంగంలో వరస విజయాలు అందుకున్న సత్యదేవ్.. ఈ మధ్యే తిమ్మరుసుగా వచ్చాడు. ఇది కూడా పర్లేదనిపించింది. ఇప్పుడు చిరు సినిమాలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. లూసీఫర్ రీమేక్‌లో ఈయన కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అనుచరుడి పాత్రలో ఇక్కడ సత్యదేవ్ కనిపించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సత్యదేవ్ నటించేది అనుచరుడి పాత్రలో కాదని విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
కీర్తి సురేష్ ఏంటి హీరోలకు చెల్లెలుగా నటిస్తుంది
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా