Dharmendra | బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ధర్మేంద్ర మృతికి సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఓ శకం ముగిసిందంటూ (End of an era in Indian cinema) ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారని.. ఇది ఎంతో విచారకరమైన సమయం అని పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తన ట్వీట్లో ప్రధాని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
ధర్మేంద్ర (Actor Dharmendra) మృతి భారత సినిమాకు తీరని లోటు అని రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పేర్కొన్నారు. ఆయన తన దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. ‘అలనాటి నటుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ధర్మేంద్ర మృతి భారత సినిమా తీరని లోటు. ఆయన తన దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన, మరుపురాని పాత్రలు పోషించారు. భారత సినిమాకు ఆయన మహోన్నతమైన వ్యక్తి. ధర్మేంద్ర కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా’ అని రాష్ట్రపతి తన పోస్టులో పేర్కొన్నారు.
Also Read..
Dharmendra: గోప్యంగా ధర్మేంద్ర అంత్యక్రియలు !
Dharmendra: ఓ ఆజ్ మౌసమ్ బడా బేహిమాన్ హై.. ధర్మేంద్ర హిట్ సాంగ్స్ వీడియో