ముంబై: బాలీవుడ్ ఫిగర్ ధర్మేంద్ర(Dharmendra) ఇవాళ కన్నుమూశారు. యాక్షన్ హీరోగానే కాదు.. ఆయన రొమాంటిక్ అపీల్తోనూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. ఆరు దశాబ్ధాల ఫిల్మ్ కెరీర్లో ఎన్నో హిట్స్ సాంగ్స్‌లో నటించారు ధర్మేంద్ర. అతని సుదీర్ఘ కెరీర్లో సుమధురమైన గీతాలు ఎన్నో ఉన్నాయి. ధర్మేంద్ర నటించిన ఆల్ టైం హిట్ సాంగ్స్ కేటగిరీలో లోఫర్ చిత్రంలోని పాట నిలుస్తుంది. ఓ ఆజ్ మౌసమ్ బడా బేహిమాన్ హై అంటూ సాగే పాటలో ధర్మేంద్ర తన యాక్టింగ్ స్కిల్స్‌తో థ్రిల్ పుట్టిస్తాడు. లవర్ బాయ్ రోల్‌ను చాలా డిఫరెంట్‌గా పర్ఫార్మ్ చేశాడు. పాటలో ఉన్న సాహిత్యాన్ని తన హావభావాలతో ధర్మేంద్ర పలికించిన తీరు ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
1973లో లోఫర్ చిత్రం రిలీజైంది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఆ ఫిల్మ్‌కు మ్యూజిక్ అందించారు. ఆ పాటను ఆనంద్ భక్షీ రాశారు. ఆ వండర్ఫుల్ సాంగ్‌ను పాడింది మహమ్మద్ రఫీ. తన స్వరంతో రఫీ ఆ సాహిత్యంలోని అద్భుతాన్ని చూపించారు. ఇక ధర్మేంద్ర మాత్రం తన నటనతో అందమైన పదాలు పలకలేని భావాన్ని వ్యక్త పరిచారు. చాలా డెప్త్‌గా ఉండే ఆ పాటను.. తన కంటి కదలికలతో .. చాలా స్మూత్‌గా నటిస్తూ ధర్మేంద్ర అప్పటి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షించాడు. ఆ క్యారెక్టర్లో ఉన్న గాఢత్వాన్ని చాలా నేచురల్‌గా నటిస్తూ ఆ పాటలో ప్రజెంట్ చేశారు. సైలెంట్‌గా వేదనకు గురవుతున్న ఆ భావాన్ని ధర్మేంద్ర తన నటనతో వ్యక్తం చేసిన తీరు అనిర్వచనీయం. ఆనెవాలా కోహీ తూఫాన్ హై అంటూ ఆయన తన యాక్టింగ్‌తో ఆ పాటకు వన్నెతెచ్చారు.
1977లో రిలీజైన డ్రీమ్‌గర్ల్ చిత్రంలోని కిసీ షాయర్ కి గజల్ డ్రీమ్‌గర్ల్ అంటూ సాగే పాట ధర్మేంద్ర కెరీర్లో మరో హైలెట్. ఈ ఫిల్మ్‌లో డ్రీమ్‌గర్ల్ పాత్రను హెమామాలిని పోషించింది. అయితే ధర్మేంద్ర, హేమా మాలినీ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ ఫిల్మ్‌లో చూడవచ్చు. పల్ పల్ దిల్ కీ పాస్(బ్లాక్ మెయిల్, 1973), హమ్ బెవఫా హర్గిజ్ నా తే(షాలిమార్, 1978), ఆప్కీ నజరోన్ నే సంజా(అన్పడ్, 1962), అబ్ కీ సాజన్ సావన్ మే(చుప్కే చుప్కే(1975), యే దిల్ తుమ్ బిన్ లత్తా నహీ(ఇజ్జత్, 1968), సాతియా నహీ జానా కీ జీ నా లగే(ఆయా సావన్ జూమ్ కే, 1969), యే దోస్తీ హమ్ నహీ తోడేంగే(షోలే, 1975), ఓ మేరీ మెహబూబా(ధరమ్ వీర్, 1977), మై జాత్ యమ్లా పగ్లా దీవానా(ప్రతిజ్ఞ, 1975), అరే రఫా రఫా దేకో(కహానీ కస్మత్ కీ, 1973), జిల్మిల్ సితారో కా ఆంగన్ హోగా(జీవన్ మృత్యు, 1970), కల్ హి హసీన్ ములాకత్ కే లియే(చారల్, 1976), కో హసీనా జబ్ రూత్ జాతి హై(షోలే, 1975) లాంటి ఎన్నో హిట్ సాంగ్స్‌లో ధర్మేంద్ర నటించారు.