ముంబై : బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర(Dharmendra) అంత్యక్రియలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు చేపట్టారు. ధర్మేంద్ర మృతికి సంబంధించిన వార్తలను ఫిల్మ్‌ఫేర్ తన ఎక్స్ అకౌంట్లో అప్డేట్ ఇచ్చింది. ధర్మేంద్ర భార్య , ప్రఖ్యాత నటి హేమామాలిని, ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్.. శ్మశానవాటికకు చేరుకున్నారు.
Daughter #EshaDeol arrives at the Pawan Hans Cremation Centre for #Dharmendra ji’s last rites.#FilmfareLens pic.twitter.com/fpqOIUT2uv
— Filmfare (@filmfare) November 24, 2025
కొన్ని రోజుల క్రితం ధర్మేంద్ర మృతిపై మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధర్మేంద్ర ఫ్యామిలీ.. మీడియాపై కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ధర్మేంద్ర మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ధర్మేంద్ర ఫ్యామిలీ కొట్టిపారేసింది. ఆ రోజు రక్షణ మంత్రి తన ట్విట్టర్ అకౌంట్లో కూడా ధర్మేంద్రకు నివాళి అర్పించారు. ఓ దశలో ఇంటి ముందు వేచి చూస్తున్న మీడియాపై ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా ధర్మేంద్ర అంత్యక్రియులు నిర్వహించడం గమనార్హం.
#HemaMalini reaches the cremation ground after #Dharmendra Ji’s demise. #FilmfareLens pic.twitter.com/fGwcgb2CSX
— Filmfare (@filmfare) November 24, 2025