Dharmendra | భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.
89 ఏండ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం ముంబై (Mumbai)లోని క్యాండి ఆస్పత్రిలో (Candy Hospital) చేరి చికిత్స పొందారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. ధర్మేంద్ర వెంటిలేటర్‌పై ఉన్నారంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లుగా కూడా కథనాలు వచ్చాయి.
అయితే, ఆ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచినట్లు బాలీవుడ్ మీడియా నివేదించింది. పవన్ హన్స్ శ్మశానవాటికలో ధర్మేంద్ర (Dharmendra) అంత్యక్రియలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్‌ఫేర్ తన ఎక్స్ అకౌంట్లో తెలిపింది. మరోవైపు ధర్మేంద్ర నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్‌పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్ (Ikkis)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
Also Read..
Swayambhu | నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ .. మరో హిట్ ఖాయమా?
Shraddha Kapoor | షూటింగ్లో గాయపడ్డ శ్రద్ధా కపూర్.. ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది అంటే..!