Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్ పోషించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రైలర్ లాంచ్ చేశారు.
నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య.. అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ.. కాలి గోటి నుంచి తల వరకు ఏది కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించానంటున్నాడు బ్యాంక్ ఉద్యోగి దుల్కర్ సల్మాన్.
లక్కీ భాస్కర్ ట్రైలర్..
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?