శ్రీలంకలో పుట్టి టాలీవుడ్ లో హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీకి సరిహద్దులు లేవు. టాలెంట్ ఉంటే చాలు ఎక్కడినుంచైనా రావచ్చు. తన సత్తా చూపించి ఇక్కడ స్టార్స్ అయిపోవచ్చు. ఒక ఇండస్ట్రీలో సినిమా చేయాలంటే ఆయన అక్కడి వాడే కావాల్సిన అవసరం లేదు.

సినిమా ఇండస్ట్రీకి సరిహద్దులు లేవు. టాలెంట్ ఉంటే చాలు ఎక్కడినుంచైనా రావచ్చు. తన సత్తా చూపించి ఇక్కడ స్టార్స్ అయిపోవచ్చు. ఒక ఇండస్ట్రీలో సినిమా చేయాలంటే ఆయన అక్కడి వాడే కావాల్సిన అవసరం లేదు. వేరే రాష్ట్రం, వేరే దేశం నుంచి కూడా రావచ్చు. అలా తెలుగు ఇండస్ట్రీలో శ్రీలంక నుంచి వచ్చిన ఒక హీరో ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. వచ్చీ రావడంతోనే ఒక పెద్ద హిట్టు కొట్టి అందరి నోళ్లలో నానాడు. ఆ తర్వాత దాదాపు పది సినిమాలకు పైగా నటించాడు. ఆ హీరో ఎవరో తెలుసా.. జై ఆకాష్. 20 ఏళ్ల కింద శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆకాష్.
రామోజీరావు నిర్మించిన ఆనందం సూపర్ డూపర్ హిట్ అయింది. 175 రోజులు నాన్ స్టాప్ గా ఆడింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా చాలా బాగా హెల్ప్ అయింది. ఆనందం సినిమాతో ఆకాశ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆనందమానందమాయే, పిలిస్తే పలుకుతా, నమో వెంకటేశ, అందాల రాముడు, నవ వసంతం, రామ్మా చిలకమ్మా, నీతో చెప్పాలని.. ఇలా చాలా సినిమాల్లో నటించాడు.
ఆకాష్ తమిళనాడు నుంచి వచ్చాడని చాలా మంది అనుకుంటారు. కానీ ఆకాష్ పుట్టిపెరిగింది శ్రీలంకలో. ఆకాష్ కొలంబోలో జన్మించాడు. కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత లండన్ కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే మంచి విజయాలు అందుకొన్నాడు. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక రేసులో పూర్తిగా వెనుకబడిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో తనను కావాలని తొక్కేశారు అంటూ చాలా సార్లు చెప్పాడు ఆకాశ్. మనకు మొదట్లో మంచి విజయాలు వచ్చినా కూడా సినిమాలు రాకుండా చేశారని ఆరోపించాడు. తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించాడు ఈయన. వేరే ఏమైనా శ్రీలంక నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేయడం నిజంగా గొప్ప విషయమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

