విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని చంచల్గూడ జైలర్ సంజీవరెడ్డి అన్నారు. కట్టంగూర్కు చెందిన వీరమళ్ల హనుమాన్–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో...
కట్టంగూర్, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని చంచల్గూడ జైలర్ సంజీవరెడ్డి అన్నారు. కట్టంగూర్కు చెందిన వీరమళ్ల హనుమాన్–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వైద్య విద్యలో సీటు సాధించడంతో ఆనందం వ్యక్తం చేసిన జైలర్ సంజీవరెడ్డితో పాటు ఆయన చిన్ననాటి మిత్రులు బుధవారం తేజశ్రీని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్నారు. తేజశ్రీ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు తల్లిదండ్రుల కలలను సాకారం చేయగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనగోటి రమేశ్, భూపతి సురేశ్, చెరుకు శ్రీనివాస్, పోగుల యాదగిరి, కానుగు శీను, కొంపెల్లి నాగరాజు, బండ శ్రవణ్, అంతటి నగేశ్, మాతంగి శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

