Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Simran Sharma: స్ప్రింటర్ సిమ్రన్ శర్మ.. ఏషియన్ పారా గేమ్స్‌లో చరిత్ర సృష్టించింది. టీ12 కేటగిరీలోని 100మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. సిమ్రన్ కేవలం 12.02 సెకన్లలో టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో సిమ్రన్‌కు ఇది రెండో గోల్డ్ మెడల్.
నగోయా: స్ప్రింటర్ సిమ్రన్ శర్మ.. ఏషియన్ పారా గేమ్స్(Asian Para Games)లో చరిత్ర సృష్టించింది. 100మీటర్ల టీ12 ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. సిమ్రన్ కేవలం 12.02 సెకన్లలో టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో సిమ్రన్‌కు ఇది రెండో గోల్డ్ మెడల్. మంగళవారం 200మీటర్ల టీ12 స్ప్రింట్ ఈవెంట్లోనూ సిమ్రన్‌కు స్వర్ణం దక్కిన విషయం తెలిసిందే. పారిస్‌లో జరిగిన పారాఒలింపిక్స్‌లో 100 మీటర్ల ఈవెంట్లో స్ప్రింటర్ సిమ్రన్ శర్మ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవాళ జరిగిన ఈవెంట్లో ఇరానీ అథ్లెట్ హజర్ సఫర్జాదే కన్నా బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది. ఇరానీ అథ్లెట్ 12.30 సెకన్లలో టార్గెట్ ఫినిష్ చేసింది. ఇండోనేషియాకు చెందిన నీ పుత్రి 12.51 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సిమ్రన్ ప్రస్తుతం కొత్త ట్రైనర్ శివం వద్ద శిక్షణ పొందుతోంది. డోపింగ్ ఉల్లంఘన కేసులో మాజీ కోచ్ ఉమర్ సైఫీని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
2023లో హాంగ్జూలో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లో సిమ్రన్ రెండు ఈవెంట్లలోనూ సిల్వర్ పతకాలు గెలిచింది. కంటిచూపుతో బాధపడేవారు టీ12 కేటగిరీలో పోటీపడుతుంటారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

