తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు-రాజమౌళి. నిజానికి ఈ కాంబినేషన్ అనౌన్స్ అయి కూడా ఏడేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో బాహుబలి జరుగుతున్న సమయంలోనే మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ప్రకటించాడు రాజమౌళి. అయితే కాలం కలిసిరాకపోవడంతో మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేశ్ బాబును ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనట్లు చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
అప్పట్లో బిజినెస్ మ్యాన్ ఆడియో వేడుకలో మహేశ్ బాబుతో తాను సినిమా చేస్తే ఏజెంట్ తరహా పాత్ర చేస్తానని.. జేమ్స్ బాండ్ అయితే బాగుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాంటి కథనే విజయేంద్ర ప్రసాద్ కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది కూడా. అయితే ఇప్పుడు దీనికి బ్రేకులు వేస్తున్నాడు త్రివిక్రమ్. తాజాగా మహేష్ బాబుతో మరోసారి పని చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఈ జోనర్‌లోనే మహేష్ బాబు సినిమాను చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈయన రాసుకున్న కథలో కూడా మహేశ్ బాబు ఏజెంట్ గానే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే పాత్రతో రాజమౌళి అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు మార్చుకోక తప్పని పరిస్థితి.
ఎందుకంటే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో హీరో పాత్ర ఏజెంట్‌గానే ఉండబోతుందని.. సీక్రెట్ ఏజెంట్ తరహా జేమ్స్ బాండ్ పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ లైన్‌ను ఎన్టీఆర్‌కు కూడా జస్ట్ క్యాజువల్‌గా త్రివిక్రమ్ వినిపించినట్లు తెలుస్తుంది. కానీ కథ డెవలప్మెంట్ పూర్తి కాకపోవడంతో ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే లైన్‌తో మహేశ్ బాబు సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. అంటే ఇప్పుడు జేమ్స్‌బాండ్ కాకుండా మరో కథను మహేశ్ బాబు కోసం రాజమౌళి రాసుకోవాల్సిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయనున్నాడు రాజమౌళి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!