టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) త్వరలోనే శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటరల్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మంగళవారం శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. నానితో దిల్ రాజు (Dil Raju) తెరకెక్కించిన ఎంసీఏ మంచి హిట్‌గా నిలిచింది.
ఇదే మ్యాజిక్ శ్యామ్ సింగరాయ్కు కూడా రిపీట్ అవుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు దిల్‌రాజు. ప్రొడ్యూసర్ వెంకట్ ఏడాది క్రితం హిట్ సినిమా తీయడం ఎలా అని నన్నడిగాడు. అతడికి హిట్టు ఇవ్వడానికి నాని ఉన్నాడని చెప్పా. నాని సినిమా కథనే చాలా ప్రామాణికంగా తీసుకుని, స్క్రిప్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. డైరెక్టర్, నిర్మాతలిద్దరూ కొత్త వారు. నాని మరింత పెద్ద స్టార్ గా మారిపోతాయని ఆశిస్తున్నా. ఎంసీఏ సినిమాలో మెరిసిన నాని-సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి శ్యామ్ సింగరాయ్కు కూడా రిపీట్ రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
ఈ చిత్రంలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనుండగా..కోలీవుడ్ హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో