టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) డైరెక్ట్ చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా రొమాంటిక్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. రవితేజ ఓ వెడ్డింగ్ ఈవెంట్లో శ్రీలీలకు రొమాంటిక్‌గా సైగలు చేస్తున్నాడు. మొదట హీరో సైగ చేస్తుంటే నో చెప్పిన హీరోయిన్ శ్రీలీల ఆ తర్వాత ఓకే చెప్పేయడం గ్లింప్స్ వీడియోలో చూడొచ్చు.
ఇపుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ (Ram Lakshman).
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. రవితేజ మరోవైపు టైగర్ నాగేశ్వర్రావు, రావణాసుర సినిమాలు కూడా చేస్తున్నాడు.
Read Also : Chiranjeevi | లో క్లాస్ టికెట్స్ లైన్లో నాగబాబుకు ఊపిరాడలేదు : చిరంజీవి
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి