దేశవ్యాప్తంగా వినాయక చవితి (Ganesha chaturthi) సంబురాలు గ్రాండ్‌గా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణం, నగరం..అన్నీ ప్రాంతాల్లో వీధుల్లో గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసి..నవరాత్రులు పూజలు జరిపేందుకు చిన్నాపెద్దా అంతా సిద్దమయ్యారు. ఇక ప్రతీ యేటా మార్కెట్లో గణేశుడు వివిధ రూపాల్లో(Ganesha idols) దర్శనమిస్తుంటాడని తెలిసిందే.
ప్రత్యేకించి ప్రతీ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో హీరోల లుక్ వచ్చేలా విగ్రహాలు తయారుచేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా మార్కెట్లో సినీ గణేశుల సందడి మొదలైంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప, రాంచరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాల్లో లీడ్ రోల్స్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఈ సినిమాల క్రేజ్‌తో తయారైన గణేశ్ విగ్రహాలు సందడి చేస్తున్నాయి. తాజాగా పుష్పరాజ్ గణేశుడు, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం గణేశుని విగ్రహాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.