జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలు వైద్యుల సేవలను గుర్తు చేసుకుంటూ..వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు వెలకట్టలేని సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ..చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు సోషల్ మీడియా ఖాతాల్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రాణాలను కాపాడే దేవుళ్లు డాక్టర్లు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం సమయంలో డాక్టర్లు వైద్యో నారాయణో హరి అనే నానుడిని మరోసారి అందరికీ గుర్తు చేశారు..అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మానవాళి సంరక్షణకు మీరు చేస్తున్న సేవలకు గౌరవం, గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు మానవత్వాన్ని మీ భుజస్కందాలపై మోసుకెళ్తూ..ఈ వృత్తికి మీ జీవితం అంకితం చేసినందుకు ధన్యవాదాలు అంటూ బాలకృష్ణ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ప్రాణాలను కాపాడే వ్యక్తులు. ఎల్లప్పుడూ గొప్ప హీరోలు. మానవాళి సంక్షేమం కోసం మీ విలువైన అసమాన సేవలు వెలకట్టలేనివి. డాక్టర్లలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు.
Saluting ALL the Doctors on this #NationalDoctorsDay.Doctors are the ONLY beings who could save lives.#VaidyoNarayanoHarihi Doctors are the Human forms of Almighty GOD!During this global health crisis this fact has been reinforced yet again.Lets be grateful to them now & always!
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 1, 2021
Saviours of life.. The greatest heroes of all time! Your contribution and commitment to the welfare of humanity is unparalleled. A big thank you to all the doctors out there! Gratitude always 🙏🙏🙏#DoctorsDay pic.twitter.com/zRcQHRtWQi
— Mahesh Babu (@urstrulyMahesh) July 1, 2021
ఇవి కూడా చదవండి..
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో