ఆరు పదుల వయస్సులోనూ అలుపెరుగకుండా అభిమానులకు వినోదాన్ని పంచేందుకు రెడీ అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇప్పటికే ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరు. ఈ ప్రాజెక్టులు లైన్లో ఉండగానే మరో సినిమాను ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. కొంతకాలంగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula)తో చిరంజీవి తన 156వ (#Chiru 156) ప్రాజెక్టును చేయబోతున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై (@DVVMovies) అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డాక్టర్ మాధవి రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవితో వెంకీ కుడుముల, డీవీవీ దానయ్య కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాను దేవుడిలా ఆరాధించే చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడంతో ఆనందంలో ఎగిరి గంతేస్తున్నాడు వెంకీ కుడుముల. మరి ఈ యంగ్ డైరెక్టర్ చిరంజీవిని ఎలాంటి స్టోరీతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఆచార్య చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సెట్స్ పై ఉన్నాయి.
DVV Danayya ( @DVVMovies ) to produce a mega project with MegaStar @KChiruTweets under the direction of Successful Director @VenkyKudumula. It will be Co-Produced by Dr. Madhavi Raju.#MegaStarWithMegaFan pic.twitter.com/GFmeYHnQwg
— BA Raju's Team (@baraju_SuperHit) December 14, 2021
వెంకీ కుడుముల వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడని టాక్. వెంకీ డైరెక్ట్ చేసిన ఛలో, భీష్మ చిత్రాల్లో కన్నడ భామ రష్మిక మందన్నా నటించగా..ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. వెంకీ మరోసారి ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఈ చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఫైనల్ చేశాడని టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ