యముడు పాత్ర అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అలనాటి అగ్రహీరోలతో పోటీ పడి నటించారు. నవరస నటనా సార్వభౌముడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నేడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి పుష్ప గుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కైకాల నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో కలిసి నటించిన మధురానుభూతులన్ని గుర్తు చేసుకున్నారు. కైకాలను కలిసిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..
తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాం. కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి..అంటూ ట్వీట్ చేశారు చిరు. చివరగా ఎన్టీఆర్..కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో నటించారు కైకాల.
తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి.Happy Birthday #KaikalaSatyanarayana garu! pic.twitter.com/NTm8RCf0LE
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2021
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్