కొంపముంచిన బాలీవుడ్ పార్టీ.. కరీనా, అమృత అరోరా సహా నలుగురికి కరోనా

Kareena kapoor | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాను ఇంకా ఉన్నానని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంది కరోనా. జాగ్రత్తగా లేకపోతే మీ దగ్గరికి వచ్చేస్తానని హెచ్చరిస్తూనే ఉంది ఈ వైరస్. తాజాగా బాలీవుడ్లో కరోనా మరోసారి పంజా విసిరింది. ఏకంగా నలుగురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అది కూడా ఓ పార్టీకి అటెండ్ అయిన తర్వాత వారు కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా కరీనా కపూర్ ఖాన్ , అమృతా అరోరాకు కరోనా పాజిటివ్ వచ్చింది. BMC చెప్పిన సమాచారం ప్రకారం.. హీరోయిన్ సీమా ఖాన్‌కు ముందుగా కరోనా వచ్చింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతో వెంటనే టెస్ట్ చేస్తే కరోనా వచ్చింది. ఆ మరుసటిరోజు కరీనా కపూర్, అమృతా అరోరా ఇద్దరూ టెస్ట్ చేయించుకున్నారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

‘ఫేబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ లో నటించిన వాళ్లంతా డిసెంబర్ 8, 2021న దర్శకుడు కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన తర్వాత కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి హాజరైన వాళ్లంతా ఐసోలేషన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బీఎంసీ (BMC) వివిధ బృందాలను ఏర్పాటు చేసి పార్టీకి హాజరైన వారికి సన్నిహితంగా ఉన్న వాళ్ల సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. కరీనా, అమృతా అరోరా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే వాళ్లను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కరణ్ జోహార్ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు కానీ ఆయనకు నెగిటివ్ వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | రానాకు బర్త్ డే విషెస్ చెప్పిన సమంత.. అప్పుడు చైతూకి మాత్రం..
DANIEL SHEKAR Birthday Video | ‘వాడు అరిస్తే భయపడతార్రా..’ డానియల్ శేఖర్ ఎంట్రీ కేక
జాక్వెలిన్‌కు 7 కోట్ల విలువైన ఆభరణాలు ఇచ్చిన సుకేశ్
Mahesh Babu | ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు శస్త్రచికిత్స
బాయ్ ఫ్రెండ్స్ నుండి కోట్ల రూపాయల బహుమతులు అందుకున్న కత్రినా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

