జాక్వెలిన్‌కు 7 కోట్ల విలువైన ఆభరణాలు ఇచ్చిన సుకేశ్

ముంబై : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు విచారించారు. ఆ విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేలకు విలాసవంతమైన గిఫ్ట్‌లు ఇచ్చినట్లు తేలింది. మేకప్ ఆర్టిస్ షాన్ ముత్తాతిల్ ద్వారా సుకేశ్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్ పరిచయం ఏర్పడింది. అయితే ఈకేసులో ఈ మధ్యే జాక్వెలిన్‌ను విచారించారు. తనకు గుక్కీ బ్యాగులు, ఛానల్ బ్యాగులు, లూయిస్ విట్టాన్ షూలు గిఫ్ట్‌గా వచ్చినట్లు విచారణలో ఫెర్నాండేజ్ తెలిపింది. నిందితుడు సుకేశ్ తనకు మినీ కూపర్ కారును కూడా బహూకరించినట్లు ఆమె చెప్పింది. అయితే దేశం విడిచి వెళ్లాలనుకున్న జాక్వెలిన్‌ను ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న విషయం తెలిసిందే.
ఇదే కేసులో సుకేశ్ మరికొన్ని కొత్త విషయాలను వెల్లడించారు. జాక్వెలిన్‌కు సుమారు ఏడు కోట్ల విలువైన ఆభరణాలను ఇచ్చినట్లు చెప్పాడు. అమెరికాలో నివసిస్తున్న జాక్వెలిన్ సోదరికి 1.13 కోట్ల బ్యాంకు రుణాన్ని ఇప్పించినట్లు తెలిపాడు. ఆమెకు బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును కూడా బహూకరించినట్లు సుకేశ్ తెలిపాడు. జాక్వెలిన్ పేరెంట్స్‌కు కూడా కాస్ట్లీ గిఫ్ట్‌లు ముట్టాయి. వాళ్లకు ఓ మసరేటి కారుతో పాటు బహ్రెయిన్‌లో ఉన్న జాక్వెలిన్ తల్లికి పోర్షే కారు కూడా ఇప్పించాడు.
ప్రస్తుతం రామ్ సేతు, అటాక్, బచ్చన్ పాండే చిత్రాల్లో జాక్వెలిన్ నటిస్తోంది. కిక్ 2 చిత్రంలో సల్మాన్ ఖాన్‌తోనూ ఆమె నటిస్తోంది. కేంద్ర హోంశాఖ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నట్లు చెప్పి జాక్వెలిన్‌తో సుకేశ్ పరిచయాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత గిఫ్ట్‌లతో జాక్వెలిన్‌కు దగ్గరయ్యాడు. ఓ దశలో సుకేశ్‌కు కిస్ కూడా ఇచ్చింది జాక్వెలిన్. ఆ సమయంలో సుకేశ్ సెల్ఫీ తీశాడు. అమిత్ షా ఆఫీసు నుంచి ఫోన్ చేసి.. జాక్వెలిన్‌తో సుకేశ్ ఫ్రెండ్షిప్ కొనసాగించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

