టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినా కైఫ్ తన కన్నా చిన్నవాడైన విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకొని హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. విక్కీ కంటే ముందు చాలా మంది హీరోలతో ఎఫైర్స్ నడిపిన ఈ ముద్దుగుమ్మ చివరకు విక్కీతో వైవాహిక బంధం ఏర్పరచుకుంది. కొద్ది రోజులుగా విక్కీ- కత్రినాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
పెళ్లి తర్వాత కత్రినా రిలేషన్‌కి సంబంధించి పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్స్ నుండి కోట్ల రూపాయలు బహుమతులు అందుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కత్రిన కైఫ్ .. రణబీర్ కపూర్‌తో కొన్నేళ్లు డేటింగ్ చేయగా, చివరకు విక్కీని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో రణ్‌బీర్ ..ఆమెకు రూ.2.7కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడట.
ఇక కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ నూతన జంటకి 3కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కార్ ని కానుకగా ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను ఆలియా భట్ బహుమతిగా ఇవ్వడం జరిగిందట. కత్రినాకు రూ.6.4లక్షల విలువైన డైమండ్ చెవిపోగులను అనుష్క శర్మ గిఫ్ట్ గా ఇచ్చిందని తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ కూడా వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్ ను బహుమతిగా ఇవ్వడం జరిగిందట.
హృతిక్ రోషన్.. విక్కీకి బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ బైక్ ని బహుమతిగా ఇచ్చాడు. ఈ బైక్ విలువ వచ్చేసి 3 లక్షలు సుమారుగా ఉంటుంది. అలాగే తాప్సీ విక్కీకి రూ.1.4లక్షల విలువైన ప్లాటినం బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చిందట. ఇలా బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి ఖరీదైన బహుమతులు ఇచ్చి తమ అభిమానాన్ని చూపించారు. ఇక కత్రినా కైఫ్ తన భర్తకు ముంబైలోని రూ. 15కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ను బహుమతిగా ఇవ్వగా, విక్కీ ..తన హాట్ వైఫ్ కి రూ.1.3కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడు.