samantha birthday wishes to Rana | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం చేసినా వైరల్‌గా మారుతుంది. విడాకుల తర్వాత ఆధ్యాత్మిక టూర్ వెళ్లడం మొదలు.. ఆమె ఒప్పుకునే సినిమాలు.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు. వాటి వెనుక కారణం ఏమై ఉంటుందని రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు. ఆ తర్వాత దీనికి రకరకాల కారణాలను వెతికారు. అంతకుముందు పుష్ప సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా అంతే. పుష్ప రాజ్.. తగ్గేదేలే అంటూ ఫైర్ ఎమోజీస్‌తో సమంత ట్వీట్ చేసింది. అప్పుడు దీనిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. మాజీ భర్త నాగచైతన్య, మామ నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమా నుంచి రెండు పాటలు రిలీజైనా సమంత స్పందించలేదు. కానీ పుష్ప సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే స్పందించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రానా దగ్గుబాటికి బర్త్ డే విషెస్ చెప్పడం కూడా మళ్లీ వైరల్‌గా మారింది.
రానా బర్త్‌డే సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. హ్యాపీ బర్త్ డే రానా. గొప్ప మనసు ఉన్న నీకు ఎల్లప్పుడూ మంచే జరగాలి. దేవుడికి ఇష్టమైన వాడివి అంటూ ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన రానా.. థ్యాంక్యూ సోమచ్ రూత్ అని కామెంట్ పెట్టాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల నాగచైతన్య బర్త్ డే జరిగింది. ఆ రోజు సామ్ విషెస్ చెప్పుద్దేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు విడిపోయినా.. ఎప్పటికీ స్నేహితుల్లా ఉంటామని విడాకుల సందర్భంగా అటు నాగచైతన్య, ఇటు సమంత అభిమానులకు తెలిపారు. దీంతో తన ఫ్రెండ్ నాగచైతన్యకు బర్త్ డే విషెస్ చెబుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సామ్ అభిమానులను నిరాశపరిచింది. కానీ ఇప్పుడు నాగచైతన్య బావ రానాకు సమంత విషెస్ చెప్పడం వైరల్‌గా మారింది. నాగచైతన్యకు బర్త్ డే విషెస్ చెప్పని సమంత.. ఇప్పుడు రానాకు మాత్రం శుభాకాంక్షలు చెప్పిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ariyana: అరియానా స్టైల్లో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ…!
Samantha | పుష్పలో సమంత ఐటెం సాంగ్‌పై రష్మిక రియాక్షన్ ఏంటి?
Rashmika Vs Samantha | సమంత ఎంట్రీతో రష్మికకు భయం పట్టుకుందా..?
Samantha : ఇదే చివరిసారి.. మళ్లీ అలా చేయనంటున్న సమంత