టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). కన్నడ సోయగం రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులకు ఐ లవ్ యూ చెబుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రష్మిక. అయితే పుష్ప ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మెరవనుండటంతో రష్మికకు భయం పట్టుకుందట. ఇంతకీ అంతలా భయపడే విషయం ఏమై ఉంటుందనుకుంటున్నారా..?
పుష్పలో వచ్చే సామి సాంగ్లో రష్మిక చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మరో సెన్సేషన్ సాంగ్ ఊ అంటావా మావ…ఊ ఊ అంటావా (Oo Antava) అంటూ సమంత మాస్ స్టెప్పులతో ఇరగదీసిన పాట విడుదలైంది. ముందుగా విడుదలైన సామి పాట (Saami song ) 2 మిలియన్ల వ్యూస్ రాబడితే..ఆ తర్వాత విడుదలైన ఊ అంటావా పాట ఏకంగా 4 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ పాటలో సమంత హాట్ లుక్లో అదరగొడుతూ అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటుంది. సామ్ డ్యాన్స్ చేసిన పాటకు సోషల్ మీడియాలో అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అదిరిపోయే స్టెప్పులతో మంచి క్రేజ్ వస్తుందనుకునే లోపే సమంత వచ్చి తన పాపులారిటీని ఎక్కడ లాక్కెళ్తుందోనని రష్మికకు తెగ గుబులు పట్టుకుందట. మరి పుష్ప విడుదలైన తర్వాత సమంత డ్యాన్స్ పాట గురించి మాట్లాడతారా..? రష్మిక యాక్టింగ్ గురించి డిస్కస్ చేస్తారా..? అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ