Rajpal Yadav | బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ స్టార్ కమెడియన్స్‌లో ఒకరు రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav). తన కామెడీ టైమింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న రాజ్ పాల్ యాదవ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్‌పాల్ యాదవ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ ప్రాపర్టీని సీజ్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం రాజ్‌పాల్ యాదవ్ ఓం పురి లీడ్ రోల్ చేసిన సినిమా నిర్మాణం కోసం ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన ప్రాపర్టీని తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో రుణం కాస్తా రూ.11 కోట్లకు చేరుకుంది. ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేకపోవడంతో బ్యాంక్ అధికారులు రాజ్ పాల్ యాదవ్ ప్రాపర్టీకి సీల్ వేశారు. రాజ్ పాల్ యాదవ్ ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు.
2018లో ఓ సినిమా కోసం తీసుకున్న అప్పును తీర్చకపోవడంతో మూడు నెలలు జైలులో కూడా ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో తన రుణాన్ని తిరిగి చెల్లిస్తాడా..? లేదా..? అన్నది సస్పెన్స్ నెలకొంది.
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !