Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి SK21. అమరన్ (Amaran) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శుభాకాంక్షలు తెలియజేసింది అమరన్ టీం. ఈ సందర్భంగా అమరన్ మేకింగ్ వీడియోను షేర్ చేసింది.
శివకార్తికేయన్ టీం ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో తెరకెక్కించిన సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఈ మూవీలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
కథానుగుణంగా రాజ్‌కుమార్ పెరియసామి టీం కశ్మీర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. కశ్మీర్లో 75 రోజులపాటు అమరన్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్టు ఇప్పటికే మేకర్స్ అప్డేట్ అందించారు. మరోవైపు కశ్మీర్ షూటింగ్ లొకేషన్లో సాయిపల్లవి, శివకార్తికేయన్ దిగిన ఫొటోలు నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమరన్ టీం రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
We stand free because they stand strong, salute to our soldiers!#HappyIndependenceDay wishes from #Amaranhttps://t.co/AWu82H0a3U#AmaranDiwali#AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy@ikamalhaasan @Siva_Kartikeyan… pic.twitter.com/gk9W4NbWPT
— Raaj Kamal Films International (@RKFI) August 15, 2024
Read Also :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?