కాలం మారింది..ఏ భాషలో తీసిన సినిమాలు ఆ భాషలోనే విడుదల చేసే రోజులు పోయాయి. ఇపుడు ఏ భాషలో తెరకెక్కించిన సినిమా అయినా అందరికీ వారి వారి ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. తెలుగు సినిమా(Telugu Films) లైతే హిందీలో విడుదలవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అక్కడ తెలుగు సినిమాల మార్కెట్ కూడా పెరుగుతుంది. హిందీ బిజినెస్ పై కన్నేసిన టాలీవుడ్ మేకర్స్ ఆ దిశగా ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్ల ఎంపికలో ఎక్కువగా బాలీవుడ్ భామల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లకున్న క్రేజ్‌ను వాడుకుంటే హిందీ మార్కెట్లో దాదాపు సక్సెస్ అయినట్టేనని ఫిక్సయిపోతున్నారు దర్శకనిర్మాతలు. ఇటీవల కాలంలో వస్తున్న, రాబోతున్న చిత్రాలను గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అలియాభట్, కియారా అద్వానీ ఇపుడు లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. కొందరు తెలుగు హీరోలు ఇప్పటికే దిశాపటానీ, కృతిసనన్,తాప్సీ లాంటి బాలీవుడ్ భామల (Bollywood Beauties)ను లీడింగ్ లేడీ రోల్ కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నారు.
హీరోయిన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వారంతా ఇపుడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ నుఅడుగుతున్నారని బీటౌన్ సర్కిల్ టాక్. బాలీవుడ్ హీరోయిన్లు సుమారు ఒకసినిమా చేయాలంటే సుమారు 5 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఈ తెలుగు సినిమాలు హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతాయి. అంతేకాదు వాటిని ఓటీటీ ప్లాట్ ఫాంలలో కూడా భారీ మొత్తానికి అమ్ముకుంటారు. ఓ నిర్మాత అంత భారీ మొత్తంలో డబ్బు ఆర్జించినపుడు…ఎందుకు బాలీవుడ్ స్థాయిలో తమకు రెమ్యునరేషన్ ఇవ్వకూడదని బీటౌన్ భామలు ప్రశ్నిస్తున్నారట.