కాళిదాసు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా మెరిశాడు అక్కినేని హీరో సుశాంత్ (Akkineni Sushanth). ఆ తర్వాత చేసిన కరెంట్ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత హీరోగా సరైన బ్రేక్ రాకపోవడంతో అల వైకుంఠపురంలో (Ala Vaikunthapuramlo) చిత్రంలో కీలక పాత్రలో నటించి యూ టర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న రావణాసుర (Ravanasura )లో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా అప్పడప్పుడు కనిపించే సుశాంత్ కొత్త అవతారంలో కనిపించి..నెటిజన్లకు షాకిచ్చాడు.
ఈ యువ హీరో సముద్ర తీర ప్రాంతంలో లుంగీ, బనియన్ గెటప్ ( Lungi avatar)లో చక్కర్లు కొడుతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త లుక్‌లో కెమెరాకు పోజులిచ్చిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏంటి సంగతులు అని ట్వీట్ చేశాడు సుశాంత్. సుశాంత్ ఏదైనా సినిమా కోసం బీచ్‌లో ఉన్నాడా..? లేదంటే సమ్మర్ వెకేషన్ టూర్ ఏమైనా ప్లాన్ చేశాడా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఫొటోపై మీరూ ఓలుక్కేయండి. ప్రస్తుతం తెలుగుతోపాటు ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు సుశాంత్.
ఏంటి సంగతులు? Suppp?#MNT pic.twitter.com/InsWHwD9wJ
— Sushanth A (@iamSushanthA) March 31, 2022