సోనూసూద్ పై హైదరాబాదీల ప్రేమ చూడండి..వీడియో

సోనూ సూద్ గురించి చెప్పాలంటే లాక్‌డౌన్‌కు ముందు..ఆ తర్వాత అని చెప్పాలేమో..? ఎందుకంటే లాక్డౌన్ కు ముందు ఈయన కూడా అందరిలాంటి నటుడు.. సినిమాల్లో విలన్. అంతే.. తెలుగులో పెద్దగా క్రేజ్ ఏం లేదు. సినిమాలు చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే. కానీ ఇప్పుడు అలా కాదు.. సోనూసూద్ అంటే హీరో. హీరోలను మించిన రియల్ హీరో. ఆయనకు అభిమానులు కాదు ఇప్పుడు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల నుంచి వచ్చిన అభిమానం కాదు ఇది.. రియల్ లైఫ్‌లో వచ్చింది. అంత ఈజీగా పోదు.
గత కొన్ని నెలలుగా సోనూ చేస్తున్న మంచి పనులు చూసి ఇండియా అంతా ఆయన్ని పొగిడేస్తున్నారు. లాక్ డౌన్ మొదలైన తర్వాత సోనూ సూద్‌లోని మంచి మనిషి నిద్ర లేచాడు. అది ఏ స్థాయికి వెళ్లిపోయింది అంటే ఇప్పుడు సోనూ ఫోటో ఇంట్లో పెట్టుకుని కొన్ని వందల కుటుంబాలు పూజలు చేస్తున్నారు. అలా మారిపోయాడు సోనూ సూద్. దాదాపు 20 వేల మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో సొంతూళ్లకు పంపించాడు సోనూ సూద్. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా కష్టం అని పిలిస్తే వాళ్లకు క్షణాల్లో సాయం చేస్తున్నాడు. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ కలియుగ దానకర్ణుడు అయిపోతున్నాడు సోనూ సూద్. అలాంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు.
ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ చేస్తున్నాడు. అందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు సోనూ. ఈయన వచ్చాడని తెలుసుకున్న అభిమానులు క్యారీవాన్ దగ్గరికి వచ్చి నానా హంగామా చేసారు. సోనూ సూద్ బయటికి వచ్చి అక్కడ ఉన్న అభిమానులను..తనపై చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అంతేకాదు హైదరాబాద్ లవ్ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు కూడా. ఎవరేం అనుకున్నా కూడా ఇప్పుడు ఈయనకు మాత్రం హీరోలను మించిన అభిమానం అయితే ఉంది. ఆచార్యతో పాటు అల్లుడు అదుర్స్ లో కూడా నటిస్తున్నాడు సోనూ సూద్. ఈ రెండు సెట్స్ లో కూడా సోనూకు రాగానే సత్కారం చేసారు దర్శక నిర్మాతలు.
Hyderabadi love ❤️ https://t.co/i71s016GXW
— sonu sood (@SonuSood) November 29, 2020
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు
- టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
- తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని